ePaper
Tuesday, July 14, 2026
ePaper
Homeఎడిటోరియల్లింగంపేట్ మండలం శెట్పల్లి గ్రామానికి చెందిన యువకులు బి.ఆర్.ఎస్ పార్టీ,లోకి చేరికలు.

లింగంపేట్ మండలం శెట్పల్లి గ్రామానికి చెందిన యువకులు బి.ఆర్.ఎస్ పార్టీ,లోకి చేరికలు.

📰 Generate e-Paper Clip

(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 12)
లింగంపేట్ మండలం శెట్పల్లి గ్రామానికి చెందిన యువకులు విజయ్, సాయికుమార్, శ్రావణ్, అనీల్, సదానంద్, శ్రీకాంత్ మరియు వారితో పాటు మరి కొంతమంది ఈ రోజు కామారెడ్డి బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయం లో *ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్* గారి సమక్షంలో *భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)* పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా *మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ గారు* వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలపై నమ్మకంతోనే తాము బిఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నామని చేరిన యువత తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం కేవలం *మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్* గారితోనే అభివృద్ధి సాధ్యమని వారి నాయకత్వం లో నడుస్తామని తెలిపారు..
బి.ఆర్.ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారి నాయకత్వంలో మరింత మంది యువత చేరానున్నారు అని తెలిపారు..
– ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!