ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 13
మారుతున్న సమీకరణాలు..
సోమవారం ఎమ్మెల్యే మదన్ మోహన్ స్వయంగా ఎర్రపహాడ్ సర్పంచ్ దంపతులకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మండలంలో ఎమ్మెల్యే చేపట్టిన అభివృద్ధి పనులే సర్పంచుల చేరికలకు కారణమని స్థానిక రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎర్రపహాడ్ గ్రామంలో పాఠశాల ఆధునికీకరణకు రూ. 17 లక్షలు, రూ. 20 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం,కొత్త రేషన్ కార్డు,ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి నిర్ణయాత్మక చర్యలు సర్పంచ్ దంపతులను కాంగ్రెస్ వైపు ఆకర్షించాయి.
సర్పంచుల చూపు హస్తం వైపు..
ఎమ్మెల్యే మదన్మోహన్ నాయకత్వంలోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నాం, అని పార్టీలో చేరిన సర్పంచ్ మల్లవ్వ పేర్కొన్నారు. చిట్యాల సర్పంచ్ రంజిత్ రెడ్డి బాటలోనే ఇప్పుడు ఎర్రపహాడ్ సర్పంచ్ దంపతులు కూడా రావడం మండలంలో ఆసక్తిగా మారింది. రాబోయే రోజుల్లో మరికొందరు సర్పంచులు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉందనే సంకేతాలు పార్టీ వర్గాల నుంచి వెలువడుతున్నాయి. ఈ చేరికలు మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే కాకుండా, ప్రత్యర్థులకు రాజకీయ సవాల్‌గా మారాయనే సాంకేతాలు వెలువడుతున్నాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సంజీవ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శివాజీ, సుధాకర్ రావు, మేకల రాజు, శ్రీకాంత్, దయాకర్, సీనియర్ నాయకులు, స్థానిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరిన సర్పంచులు ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే మదన్మోహన్
RELATED ARTICLES
