ePaper
Tuesday, July 14, 2026
ePaper
Homeఎడిటోరియల్కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రపహాడ్ గ్రామ సర్పంచ్ సోంటికె మల్లవ్వ–బీరయ్య దంపతులు:

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రపహాడ్ గ్రామ సర్పంచ్ సోంటికె మల్లవ్వ–బీరయ్య దంపతులు:

📰 Generate e-Paper Clip



(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి 13)

ఎల్లారెడ్డి నియోజకవర్గం, తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామ సర్పంచ్ సోంటికె మల్లవ్వ–బీరయ్య దంపతులు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఎర్రపహాడ్ గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు విశేష కృషి చేశారని తెలిపారు. గ్రామంలోని పాఠశాలల మరమ్మతుల కోసం రూ.17 లక్షల నిధులతో పెయింటింగ్ పనులు చేపట్టడం, గ్రామానికి రూ.20 లక్షల సీసీ రోడ్లను మంజూరు చేయడం, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం, గృహ జ్యోతి వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!