కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రపహాడ్ గ్రామ సర్పంచ్ సోంటికె మల్లవ్వ–బీరయ్య దంపతులు:

(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి 13)ఎల్లారెడ్డి నియోజకవర్గం, తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామ సర్పంచ్ సోంటికె మల్లవ్వ–బీరయ్య దంపతులు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఎర్రపహాడ్ గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు విశేష కృషి చేశారని తెలిపారు. గ్రామంలోని పాఠశాలల మరమ్మతుల కోసం రూ.17 లక్షల నిధులతో పెయింటింగ్...