ePaper
Tuesday, July 14, 2026
ePaper
Homeఎడిటోరియల్విద్యుత్ స్తంభాలు వేసి తీగలను మరిచిన విద్యుత్ శాఖ అధికారులు. విద్యుత్ శాఖ తీరుపై మండిపడుతున్న...

విద్యుత్ స్తంభాలు వేసి తీగలను మరిచిన విద్యుత్ శాఖ అధికారులు. విద్యుత్ శాఖ తీరుపై మండిపడుతున్న గ్రామస్తులు.

📰 Generate e-Paper Clip



ప్రాంతీయ వార్త ప్రతినిధి జులై 13
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ భూంపల్లి గ్రామంలో ఏడో వార్డులో విద్యుత్ స్తంభాలు వేసి తీగలను మరిచిన విద్యుత్ శాఖ అధికారులపై గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సమస్య రాకుండా చూడాలని ఆదేశించిన కానీ కొందరు విద్యుత్ అధికారులు తీరు మార్చుకోవడం లేదు. గ్రామంలో విద్యుత్ స్తంభాలు వంగి ఉన్నాయి సరి చేయాలి కానీ విద్యుత్ అధికారులు దానికి విరుద్ధంగా ఉన్నారని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని మూడు సంవత్సరాలుగా విద్యుత్ స్తంభాలు గ్రామంలో ఏర్పాటు చేసిన దానికి తీగలు మాత్రం అమర్చడం లేదు విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ తీగలను  మార్చాలని గ్రామస్తులు వేడుక గ్రామాలలో వ్యవసాయ క్షేత్రం వద్ద విద్యుత్ తీగలు కిందికి వేలాడుతూ కనబడుతున్నాయి. విద్యుత్ స్తంభాలు వేసి విద్యుత్ తీగలు అమర్చకపోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లైన్మెన్ ఏఈ. ఏఏఈ. ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి విద్యుత్ స్తంభాలకు విద్యుత్ తీగలను అమర్చే విధంగా కృషి చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఏడో వార్డులో విద్యుత్ స్తంభాలు మూడు సంవత్సరాలుగా. క్రితం వేసి విద్యుత్ తీగలను అమర్చకపోవడం అప్పుడున్న లైన్మెన్ ఏఈ నిర్లక్ష్యమే అని గ్రామస్తులు అంటున్నారు ఇకనైనా విద్యుత్ అధికారులు స్పందించి ఎవడో వార్డులో విద్యుత్ స్తంభాలకు విద్యుత్ తీగల మార్చాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!