ePaper
Tuesday, July 14, 2026
ePaper
Homeఎడిటోరియల్ఓటరు జాబితాపై ప్రజల్లో అపోహలు తొలగించాలి –SIR ఫామ్ ప్రతి ఇంటికి చేరే విధంగా చూడాలి.

ఓటరు జాబితాపై ప్రజల్లో అపోహలు తొలగించాలి –SIR ఫామ్ ప్రతి ఇంటికి చేరే విధంగా చూడాలి.

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూలై 12

ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ లింగంపేట ఎమ్మార్వో సురేష్
లింగంపేట్ మండల్ లో స్పెషల్ డ్రైవ్
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ _ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) పై బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏలు) SIR ఫామ్  ప్రతి ఇంటికి అందే విధంగా చూడాలి
ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్
ఈ సందర్భంగా ప్రభాకర్ గారు మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి అర్హుడైన ఓటరు పేరు నమోదు కావడంతో పాటు అనర్హుల పేర్లు తొలగించేలా బీఎల్‌ఏలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ, ఓటర్లలో ఎలాంటి అపోహలు తలెత్తకుండా చూడాలని అన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయిలో బీఎల్‌ఏలు చురుకుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ, సవరణ ప్రక్రియను విజయవంతం చేయడంలో BLO ప్రతి ఇంటికి వెళ్లి పనిచేయాలని సూచించారు. సమావేశం లో మండల అధ్యక్షులు సాయిరాం యాదవ్. కాశీరం యాదవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైనారిటీ సెల్ రఫీయొద్దీన్ BC సెల్ మండల అధ్యక్షులు దుర్షెటి అశోక్. మండల ప్రధాన కార్యదర్శి  dr విఠల్ వున్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!