(ప్రాంతీయ వార్త స్టోరీ రవీందర్)
————————————
ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ భారతీయ సమాజాన్ని మార్చాలన్న విశ్వప్రయత్నం చేస్తుంటే, మన దేశ యువత జెన్-జెడ్ తరం ఎటు సాగుతోంది? ప్రపంచ యువత వర్సెస్ తెలుగు యువత వ్యవహార శైలి, ఆలోచన విధానం సరైన ధోరణలో ఉందా దాన్ని సంస్కరించుకోవాలా లేదనే విషయాలను చిత్తశుద్ధితో పరిశీలించుకోవాలి.
నేపాల్ 2025 జెన్ జడ్ ఉద్యమం, బంగ్లాదేశ్ 2024 జులై తిరుగుబాటు, శ్రీలంక 2022 ఆరాగలయలో యువత వాస్తవానికి పెద్ద మార్పు తెచ్చింది. అక్కడ అవినీతి, ఉద్యోగాలు, ఆర్థిక సంక్షోభం, అధికార దుర్వినియోగం వంటి నిర్దిష్ట సమస్యలపై వారు రోడ్డుపైకి వచ్చారు. ఫలితంగా ప్రభుత్వాలు మారాయి. మధ్యంతర ప్రత్యామ్నాయాన్ని చూపించాయి.
కానీ అక్కడ కూడా పూర్తి “సక్రమ ప్రజాస్వామ్యం” ఇంకా స్థిరపడలేదు. ఇంకనూ హింస, విధ్వంసం, కొత్త సమస్యలు కూడా ఉన్నాయి.
మయన్మార్‌లో జెన్ జెడ్ పోరాటం ఇప్పటికీ సివిల్ వార్‌గా కొనసాగుతోంది. ఇవి ప్రత్యక్షంగా
అణచివేయడం, తొక్కిపెట్టడం లేదా నియంత్రించే ప్రాంతాలు.
భారత్‌లో ఉత్తర భారతదేశంలో బిజెపి ప్రభుత్వం మరియు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు రాజకీయంగా నియంత్రించడం, పోలీసులతో ఉద్యమాలను అణిచివేయడం, మొగ్గలోనే తుంచి వేయడం, పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ యువత ఎక్కువగా సనాతన రాజకీయ పార్టీలకు తొత్తులుగా, బానిసలుగా, చెంచాలుగా, బౌ బౌ కుక్కలుగా, మతపరమైన విశ్వాసాలకు బానిసలుగా బ్రతకడం, ప్రభుత్వాలు ప్రత్యక్షంగా చేస్తున్న అవినీతిని వ్యతిరేకించకపోవడం, తీవ్రమైన అణిచివేతకు గురవుతున్న ప్రతిఘటించకపోవడం, హక్కులు నిర్వీర్యం అవుతున్న వాటి మీద పోరాటం చేయలేకపోవడం గత రెండు దశాబ్దాలుగా యువత పెడదారిన పట్టి, సామాజిక స్పృహ లేకుండా యువత జీవితాలను కొనసాగిస్తున్నారు.
తల్లిదండ్రులను పీడించి, బ్లాక్ మెయిల్ చేస్తూ యువతీ, యువకులు సోషల్ మీడియాను తప్పుగా ఉపయోగించుకుంటూ తమ జీవితాలను దుర్బలం చేసుకుంటున్నారు. వ్యక్తిగత సరదా, సినిమా, క్రికెట్, బీర్-బిర్యానీ సంస్కృతి వైపు మళ్లింది. అనేక రాజకీయ పార్టీలకు పెయిడ్ ఆర్టిస్టులుగా, సంతలో సరుకుగా, ఎవరు శత్రువులో, ఎవరు మిత్రులో తెలుసుకోలేని అధమ స్థాయి అవగాహనతో యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
“చైతన్య పోరాటాలు వదిలి దోపిడీ రాజకీయ పార్టీలకు మద్దతుదారులుగా హీరో ఆరాధన వరకు యువత ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
“విద్యార్థి చేతిలో పుస్తకం ఉండాల్సిన చోట బాణాసంచా ఉంది.” నోట్లో సిగరెట్టు వెలిగిస్తూ అవాయి సువాళ్ళు పేల్చడం వీరి ప్రత్యేకత. “రాజ్యాంగం ఉండాల్సిన చోట హీరో పోస్టర్ ఉంది.” తీన్మార్ డప్పులతో తాగి ఊగటం వీరు నైజం. “ఉద్యోగాల కోసం ప్రశ్నించాల్సిన చోట సనాతన పార్టీల డప్పులు వాయించడం ఫ్యాన్ వార్స్ ఉన్నాయి.” ఇది కేవలం ఒక వ్యాఖ్య కాదు. నేటి భారతీయ యువత, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల యువతలో మెజారిటీ భాగం ఎదుర్కొంటున్న సామాజిక-మానసిక సంక్షోభానికి అద్దం పట్టే వాస్తవం. ఆదిపత్య కులాల యువత అదే తీరు, బహుజనుల యువత కూడా అదే తీరు. ఎవరికీ ఎవరు తీసుపోని దారుణమైన మనస్తత్వాలు.
ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే ప్రతి తరానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. నేటి యువతను “జెన్-జెడ్” తరం అని పిలుస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం చేతిలో ఉన్న మొదటి తరం ఇది. ప్రపంచంలోని ఏ మూలలో ఏం జరుగుతుందో క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఈ తరానికి ఉంది.
నేపాల్‌లో ప్రజాస్వామ్య ఉద్యమాలు,
మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేక నిరసనలు, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంపై ప్రజా ఉద్యమాలు,
బంగ్లాదేశ్‌లో విద్యార్థి నిరసనలు…
ఇలాంటి అనేక సందర్భాల్లో యువత సమాజాన్ని ప్రభావితం చేసే ప్రధాన శక్తిగా నిలిచింది. అయితే మన దేశంలో పరిస్థితి ఏమిటి?
నిరుద్యోగం పెరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రశ్నలు వస్తున్నాయి.
పరీక్షల నిర్వహణ, పారదర్శకత, అవకాశాల పంపిణీ వంటి అంశాలపై లక్షలాది యువకుల భవిష్యత్తు ఆధారపడి ఉంది.
కానీ ఈ అంశాలపై యువత ఎంత చైతన్యంతో స్పందిస్తోంది? అనే ప్రశ్న అడిగితే సమాధానం అంత ఆశాజనకంగా కనిపించడం లేదు.
సినిమా విడుదలైతే వేల మంది కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తున్నారు.
ఒక హీరో సినిమా హిట్ అయితే రోడ్లపై బాణాసంచా కాలుస్తున్నారు. ఒక క్రికెట్ జట్టు గెలిస్తే రాత్రంతా సంబరాలు చేస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు వస్తే మద్యం, బిర్యానీ, బైక్ ర్యాలీలతో ఊరేగింపులు చేస్తున్నారు.
కానీ…
❓❓❓❓❓❓❓❓
ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఆలస్యం అయితే ఎన్ని మంది ప్రశ్నిస్తున్నారు?
ఒక పరీక్షలో లోపాలు జరిగాయని ఆరోపణలు వస్తే ఎంత మంది స్పందిస్తున్నారు? ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, విద్యా నాణ్యత, నిరుద్యోగం, సామాజిక అసమానతలపై ఎంత మంది చర్చిస్తున్నారు?
❓❓❓❓❓❓❓❓❓
ఇదే అసలు ప్రశ్న????……
సమాజాన్ని మార్చే శక్తి యువతలో ఉంటుంది. కానీ ఆ శక్తి చైతన్యంగా మారకపోతే అది కేవలం జనసమూహంగా మిగిలిపోతుంది.
నేడు సోషల్ మీడియా యువతకు సమాచారాన్ని ఇస్తున్నదే కాదు, కొన్నిసార్లు దృష్టి మళ్లించే సాధనంగా కూడా మారుతోంది.
❓❓❓❓❓❓❓❓❓
ఒక రీల్‌కు గంటలు వెచ్చించే యువకుడు, ఒక సినిమా ట్రైలర్‌ను పదిసార్లు చూసే యువకుడు, ఒక హీరో కోసం సోషల్ మీడియాలో వాదించే యువకుడు…అదే సమయాన్ని తన హక్కులు, రాజ్యాంగం, విద్య, ఉపాధి, సాంకేతిక పరిజ్ఞానం, సమాజ సమస్యలపై వెచ్చిస్తున్నాడా? అనే ప్రశ్న ప్రతి యువకుడు తనను తాను ప్రశ్నించుకోవాలి.
ఈ దేశంలో కోట్లాది మంది యువకులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వారి తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు. కుటుంబాలు ఆశలు పెట్టుకుంటున్నాయి. కానీ యువతలో ఒక భాగం మాత్రం వ్యక్తి ఆరాధనలోనే మునిగిపోతోంది. హీరోల అభిమాన సంఘాలు, రాజకీయ నాయకుల అభిమాన సంఘాలు, కుల సంఘాల గొడవలు…ఇవి యువత శక్తిని నిర్మాణాత్మక మార్గం నుంచి దూరం చేస్తున్నాయి.
ఫూలే చెప్పింది విద్య. సావిత్రిబాయి చెప్పింది జ్ఞానం. పెరియార్ చెప్పింది హేతువాదం. డాక్టర్ అంబేడ్కర్ చెప్పింది చైతన్యం. కానీ నేడు మనం వాటి స్థానంలో వినోదాన్ని, వ్యక్తి పూజను, అంధ విశ్వాసాలను పెట్టుకున్నాం. బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి అంటే ఆయన పుస్తకాలు చదవాలి. ఆయన రాజ్యాంగ దృష్టిని అర్థం చేసుకోవాలి. కానీ కొన్నిచోట్ల అది కేవలం డీజేలు, ఊరేగింపులు, సంబరాలకు పరిమితమవుతోంది.
అది డాక్టర్ అంబేడ్కర్‌ను గౌరవించడం కాదు. అంబేడ్కర్‌ను అర్థం చేసుకోకపోవడం. యువతకు నేడు అత్యవసరంగా కావాల్సింది హీరో కాదు. మార్గదర్శకుడు. అభిమానం కాదు. అవగాహన. సెలబ్రిటీ కాదు.
సమాజం. వినోదం కాదు. విజ్ఞానం.
భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది అని మనం తరచూ చెబుతాం. కానీ ఆ యువత భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది? అది వారి ఆలోచనల చేతుల్లో ఉంది. ఒక తరం తన సమయాన్ని ఎక్కడ పెట్టుబడి పెడుతుందో అదే దాని భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సినిమాల్లో పెట్టుబడి పెడితే వినోదం వస్తుంది. వ్యక్తి పూజలో పెట్టుబడి పెడితే నిరాశ వస్తుంది.
కానీ విద్యలో, విజ్ఞానంలో, చైతన్యంలో, ప్రజాస్వామ్యంలో పెట్టుబడి పెడితే భవిష్యత్తు మారుతుంది.
అందుకే నేటి జెన్-జెడ్ తరానికి ఒక పిలుపు: హీరోలను అభిమానించకండి… కానీ వారిలా ఆలోచించకండి..నాయకులను గౌరవించండి… కానీ ప్రశ్నించడం మానేయకండి. సాంకేతికతను వినియోగించండి… కానీ దానికి బానిసలవ్వకండి. సంబరాలు చేసుకోండి… కానీ సమాజ సమస్యలను మరచిపోకండి
ఎందుకంటే…
ఒక దేశాన్ని మార్చేది హీరో కాదు.
చైతన్యవంతమైన యువత.శఒక సమాజాన్ని కాపాడేది నినాదాలు కాదు. విద్య, విజ్ఞానం, ప్రశ్నించే మనస్తత్వం. ఒక తరాన్ని గొప్పదిగా నిలబెట్టేది అభిమాన సంఘాలు కాదు.
అది సాధించిన సామాజిక మార్పు.
తెలుగు యువత తీరు ఎందుకు ఇంత దారుణంగా ఉంది?
RELATED ARTICLES
