తెలుగు యువత తీరు ఎందుకు ఇంత దారుణంగా ఉంది?
(ప్రాంతీయ వార్త స్టోరీ రవీందర్)------------------------------------ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ భారతీయ సమాజాన్ని మార్చాలన్న విశ్వప్రయత్నం చేస్తుంటే, మన దేశ యువత జెన్-జెడ్ తరం ఎటు సాగుతోంది? ప్రపంచ యువత వర్సెస్ తెలుగు యువత వ్యవహార శైలి, ఆలోచన విధానం సరైన ధోరణలో ఉందా దాన్ని సంస్కరించుకోవాలా లేదనే విషయాలను చిత్తశుద్ధితో పరిశీలించుకోవాలి.నేపాల్ 2025 జెన్ జడ్ ఉద్యమం, బంగ్లాదేశ్ 2024 జులై తిరుగుబాటు, శ్రీలంక 2022 ఆరాగలయలో యువత వాస్తవానికి పెద్ద మార్పు తెచ్చింది. అక్కడ అవినీతి, ఉద్యోగాలు, ఆర్థిక సంక్షోభం, అధికార దుర్వినియోగం...