(ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 06)
గాంధారి మండల కేంద్రంలో ప్రజానాట్యమండలి జిల్లా సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు సిర్ప లింగం మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు చైతన్యం చేస్తూ ప్రజల అభివృద్ధి కోసం ప్రజా కళాకారులు పోరాటం చేసారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణం ప్రజా కళాకారులు అని ప్రజా సమస్యల మీద నిరంతరం గొంతు ఎత్తి పాడుతున్న ప్రజా కళాకారులను ఈ ప్రభుత్వం విస్మరించిందని కలలను కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం రక్షించాలని డిమాండ్ చేశారు ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో జానపద ఉత్సవాలు ఉంటాయని వాటిని కామారెడ్డి జిల్లాలోని ప్రజా కళాకారులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు లింగంతో పాటు జిల్లా నాయకులు మోతిరాం డప్పు గణేష్ నర్సిరెడ్డి నగేష్ తదితరులు పాల్గొన్నారు
కళలను కళాకారులను రక్షించుకుందాం*
ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు సిర్ప లింగం పిలుపు
RELATED ARTICLES
