ePaper
Wednesday, July 1, 2026
ePaper
Homeఎడిటోరియల్రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్త రైతు భరోసా పంపిణీ కార్యక్రమాన్ని వీక్షించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు –...

రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్త రైతు భరోసా పంపిణీ కార్యక్రమాన్ని వీక్షించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు – డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్.. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వెల్లడి.

📰 Generate e-Paper Clip



ప్రాంతీయ వార్త ప్రతినిధిజూన్ 30:

*ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో రాష్ట్రస్థాయి రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు, రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులతో కలిసి రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే *శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారు,* కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు *శ్రీ ఏలే మల్లికార్జున్ గారు* వీక్షించారు.
అనంతరం వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రైతులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో రైతు భరోసా నిధులను విడుదల చేస్తోందన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యమని, ప్రతి అర్హ రైతుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా క్షేత్రస్థాయిలో కృషి కొనసాగుతుందని తెలిపారు.
రైతులతో ప్రత్యక్షంగా మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకున్న *ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు* వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!