ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 30
ఎల్లారెడ్డి మండల్ మరియు నాగిరెడ్డిపేట్ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్
శ్రీయుత గౌరవనీయులైన. ఆర్డిఓ ప్రభాకర్ గారికి వినయ్ పత్రం ఇవ్వడం జరిగింది
సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం రద్దు చేయాలని 2023-24 సంబంధించిన అల్పాహారం పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి.
పై విషయానుసారం తమరికి తెలియజేయునది ఏమనగా సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం రద్దు చేయాలని, అలాగే 2023, 2024 సంవత్సరాలకు సంబంధించిన 9 నెలల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేసి, ఇప్పుడు ప్రారంభించే అల్పాహార పథకాన్ని వంట కార్మికులతోనే నిర్వహించాలని, అల్పాహారానికి సంబంధించి విధివిధానాలు ప్రకటించాలని, గ్యాస్ సహా వంట పథకానికి సరుకులు మొత్తం ప్రభుత్వమే సరఫరా చేయాలని తమరిని కోరుతున్నాము.
డిమాండ్స్:
1.
ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు అందించే అల్పాహారం మధ్యాహ్న భోజన కార్మికులకే అప్పగించాలి.
2. సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించరాదు.
3. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వంట కార్మికులకు రూ.10వేలు ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలి.
కోడి గుడ్లను, గ్యాస్, నిత్యావసర వస్తువులను ప్రభుత్వమే సరఫరా చేయాలి. 4.
5. వంట కార్మికులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
గతంలో అల్పాహారం చేసిన బిల్లులు, పారితోషిక బకాయిలను వెంటనే చెల్లించాలి. 6.
7. వంట కార్మికులకు ప్రమాద బీమా పథకం అమలు చేయాలి.
8 వంట కార్మికులను రాజకీయ మరే ఇతర కారణాలతో తొలగించరాదు.
9. ప్రతి విద్యార్థికి మెస్ చార్జీ రూ. 25/-లు చెల్లించాలి.కావున పై న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో సుజాత హేమలత అంబవ్వ ఉషన్ బి లావణ్య భాష సాయిలు వెంకట్ బసవయ్య సుగుణమ్మ సంతోష తదితరులు
