ePaper
Wednesday, July 1, 2026
ePaper
Homeఎడిటోరియల్గుండె నొప్పితో కానిస్టేబుల్ మృతి

గుండె నొప్పితో కానిస్టేబుల్ మృతి

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 09

కామారెడ్డి జిల్లా గాంధారి.మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో గత రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్న రఘు(44) సోమవారం నైట్ డ్యూటీ నిర్వహించాడు. అనంతరం మంగళవారం ఉదయం రిలీవ్ అయి స్వగ్రామమైన బాన్సువాడలో ఇంటికి చేరుకున్నాడు. కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం చాతిలో నొప్పి వస్తుందని కుటుంబీకులకు తెలపడంతో వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు పేర్కొన్నారు. రఘుకు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని తోటి సిబ్బంది తెలిపారు. గాంధారి మండల కేంద్రంలో రెండేళ్లుగా విధులు నిర్వహిస్తూ సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. కానిస్టేబుల్ మృతిపై ఎస్సై మహేందర్, ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!