ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎంపీ వద్దిరాజు దళిత క్రైస్తవులకు ఏస్సీ హోదా కల్పించేవరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గదర్శనంలో పోరాడుతాం--------------------------------------ఎంపీ...

ఎంపీ వద్దిరాజు దళిత క్రైస్తవులకు ఏస్సీ హోదా కల్పించేవరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గదర్శనంలో పోరాడుతాం
————————————–
ఎంపీ వద్దిరాజు మాజీ మంత్రి కొప్పుల, పార్టీ నాయకులు ప్రవీణ్ కుమార్,రాజీవ్ సాగర్ తదితర ప్రముఖులతో కలిసి ఢిల్లీలో జాతీయ విచారణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ బాలకృష్ణన్ తో సమావేశం

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 09
దళిత క్రైస్తవులకు ఏస్సీ హోదా కల్పించేవరకు తమ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మార్గనిర్దేశనంలో పోరాడుతామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.ఇందుకోసం కాలం చెల్లిన 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాల్సిన అవసరం ఉందన్నారు.దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ క్యాస్ట్ (ఏస్సీ) హోదా కల్పించాల్సిందిగా కోరుతూ ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఐపీఎస్ అధికారి,పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, తెలంగాణ ఫుడ్స్ మాజీ ఛైర్మన్ మేడె రాజీవ్ సాగర్ తదితర ప్రముఖులతో కూడిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఢిల్లీ జనపథ్ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లోని జాతీయ విచారణ కమిషన్ కార్యాలయంలో మంగళవారం ఛైర్మన్ జస్టిస్ కే.జీ.బాలకృష్ణన్ తో సమావేశమయ్యారు.అనంతరం తెలంగాణ భవన్ లో రవిచంద్ర,ఈశ్వర్, ప్రవీణ్ కుమార్,రాజీవ్ సాగర్ తదితర ప్రముఖులు విలేకరులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ,ఎప్పుడో 75 ఏళ్ల కిందట 1950లో వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను నేడు సవరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.దళిత క్రైస్తవులను బీసీ-సీ కేటగిరిగా పేర్కొనడం సరైనది కాదని, సమంజసంగా లేదని, అన్యాయంగా ఉందని,దీనికి సవరణ చేయాల్సిందిగా బీఆర్ఎస్ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశానుసారం జస్టిస్ బాలకృష్ణన్ ను కలిసి వివరించామన్నారు.దళిత క్రైస్తవులను బీసీ-సీ కేటగిరిగా కాకుండా ఏస్సీలుగా గుర్తించాలంటూ కేసీఆర్ నాయకత్వాన అసెంబ్లీలో చర్చించి, ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం గురించి  బాలకృష్ణన్ కు వివరించామని ఎంపీ రవిచంద్ర తెలిపారు.తమ ప్రతినిధి బృందం చెప్పిన అంశాలను కమిషన్ ఛైర్మన్ సావధానంగా విన్నారన్నారు.కేసీఆర్ పదేళ్ల పాలనలో దళితులతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి, అభ్యున్నతికి విశేష కృషి జరిగిందని ఎంపీ రవిచంద్ర చెప్పారు.కేసీఆర్ దళితులైన ఇద్దరు నాయకులను ఉప ముఖ్యమంత్రులను చేశారని,”దళితబంధు”కు రూపకల్పన చేసి 10లక్షల చొప్పున ఉచిత సాయమందించారన్నారు.మహిళలకు, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తెలంగాణ తొట్ట తొలి సమావేశాల్లోనే తీర్మానించి కేంద్రానికి సిఫార్సు చేయడాన్ని ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు గుర్తు చేశారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలెదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం లేదని,16మంది కాంగ్రెస్, బీజేపీ లోకసభ సభ్యులు తెలంగాణ ప్రయోజనాలను గాలికొదిలేశారని ఆయన విమర్శించారు.జర్మనీ నియంత హిట్లర్ తో పోల్చుకున్న రేవంత్ రెడ్డి క్రిస్టియన్ అయిపోయినట్లా?, మసీదు,చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేసే తాను బీసీని కాకుండా పోతాన?అని ఎంపీ రవిచంద్ర వ్యాఖ్యానించారు.దళిత క్రైస్తవులకు ఏస్సీ హోదా కల్పించాలనే బీఆర్ఎస్ చేస్తున్న డిమాండ్ న్యాయమైనది,ధర్మమైనదని,ఇది ఒక తెలంగాణకు సంబంధించినది మాత్రమే కాదని,యావత్ దేశానికి చెందిన అంశమని ఆయన పేర్కొన్నారు.కేసీఆర్ నాయకత్వాన అహింసా మార్గంలో 14 ఏళ్లు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని,అదే స్ఫూర్తితో పార్లమెంట్ లోపల,బయట దళిత క్రైస్తవుల పక్షాన నిలబడి ఎస్సీ హోదా కల్పించేవరకు మొక్కవోని దీక్షతో బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!