ఎంపీ వద్దిరాజు దళిత క్రైస్తవులకు ఏస్సీ హోదా కల్పించేవరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గదర్శనంలో పోరాడుతాం<br>————————————–<br>ఎంపీ వద్దిరాజు మాజీ మంత్రి కొప్పుల, పార్టీ నాయకులు ప్రవీణ్ కుమార్,రాజీవ్ సాగర్ తదితర ప్రముఖులతో కలిసి ఢిల్లీలో జాతీయ విచారణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ బాలకృష్ణన్ తో సమావేశం
ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 09 దళిత క్రైస్తవులకు ఏస్సీ హోదా కల్పించేవరకు తమ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మార్గనిర్దేశనంలో పోరాడుతామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.ఇందుకోసం కాలం చెల్లిన 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాల్సిన అవసరం ఉందన్నారు.దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ క్యాస్ట్ (ఏస్సీ) హోదా కల్పించాల్సిందిగా కోరుతూ ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఐపీఎస్ అధికారి,పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్...