ePaper
Wednesday, July 1, 2026
ePaper
Homeఎడిటోరియల్సిపిఎం సీసీలను బదిలీ చేయాలని అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయయుడికి వినతి పత్రం

సిపిఎం సీసీలను బదిలీ చేయాలని అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయయుడికి వినతి పత్రం

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 20

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఉండవెల్లి మండలంలో తమను వేధింపులకు గురిచేస్తున్న స్థానిక ఏపీఎం, సీసీ రజితలను తక్షణమే బదిలీ చేయాలని కోరుతూ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారికి  ఉండవెల్లి మండల వీఓఏలు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వీఓఏల సంఘం అధ్యక్షుడు హెచ్. ఈదన్న మాట్లాడుతూ… ఏపీఎం, సీసీలు అకారణంగా గౌరవ వేతనాలు నిలిపివేస్తామని బెదిరిస్తూ, ఉన్నతాధికారులకు అబద్ధాలు చెబుతూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. విధులకు అడ్డంకులు సృష్టిస్తున్న సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని మండలంలోని 18 మంది వీఓఏలు ఎమ్మెల్యే గారిని కోరారు. దీనిపై ఎమ్మెల్యే గారు స్పందిస్తూ… సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీఓఏ ప్రతినిధులు రామాంజనేయులు, శివ, రాజు, కవిత, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!