సిపిఎం సీసీలను బదిలీ చేయాలని అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయయుడికి వినతి పత్రం

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 20 జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఉండవెల్లి మండలంలో తమను వేధింపులకు గురిచేస్తున్న స్థానిక ఏపీఎం, సీసీ రజితలను తక్షణమే బదిలీ చేయాలని కోరుతూ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారికి  ఉండవెల్లి మండల వీఓఏలు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వీఓఏల సంఘం అధ్యక్షుడు హెచ్. ఈదన్న మాట్లాడుతూ... ఏపీఎం, సీసీలు అకారణంగా గౌరవ వేతనాలు నిలిపివేస్తామని బెదిరిస్తూ, ఉన్నతాధికారులకు అబద్ధాలు చెబుతూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. విధులకు అడ్డంకులు సృష్టిస్తున్న సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని...