మీరు ఏమి చేసినా జైశ్రీరామ్ అంటారు. మరొకరు చేస్తే నిష్టుడు నికృష్టుడు అంటారు ఇదెక్కడి న్యాయం.
అధికారం మీ చేతుల్లో ఉంటే ఏమైనా చేయొచ్చా..
హోం శాఖ మంత్రి బండి సంజయ్ ని వెంటనే బర్తరఫ్ చేయాలి
మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్
కామారెడ్డి మే 16 ప్రాంతీయ వార్త
దేశం కోసం ధర్మం కోసం అంటూ అనేక ప్రగల్బాలు పలికే బీజేపీ నాయకులు కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ విషయంలో ఎందుకు స్పందించడం లేదు ఒక మైనర్ బాలికను పలుసార్లు స్నేహం పేరుతో ఫామ్ హౌస్ కు రప్పించుకొని కూల్డ్రింక్స్లో మత్తుమందు కలిపి పదుల సార్లు అత్యాచారానికి పాల్పడ్డ సంఘటనపై బిజెపి ఇంకా ఎందుకు మౌనంగా ఉంది అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చు అనే పొగరా అని ప్రశ్నించారు ఇక్కడ హిందూ బాలికకు అన్యాయం చేసిన బండి భగీరథ పై చర్యలు తీసుకోవడంలో బిజెపి మౌనాన్ని ఏమనాలి కంచె చేను మేసిన చందంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కొడుకు బరితెగించి చేసిన ఈ వికృత క్రీడలో బండి సంజయ్ కు బాధ్యత లేదా బిజెపి పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి సమాజం పట్ల బాధ్యత ఉంటే వెంటనే బండి సంజయ్ ను మంత్రి పదవి నుంచి భర్తరప్ చెయ్యాలి బండి సైగ్నికి నీతి నిజాయితీ ఉంటే ఈ కేసు కొనసాగుతున్నంతకాలం ఆయన ఎంపీ మంత్రి పదవికి రాజీనామా చేసి కేసు విచారణ పారదర్శకంగా నిస్పాక్షపాతంగా జరిగే విధంగా సహకరించాలి బిజెపి పలుమార్లు దేశం కోసం ధర్మం కోసం చేసే రాజకీయాలు ఇప్పుడు నిరూపించుకోవాలి అని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే చాజాల సురేందర్ గాంధారి లో విలేకరులతో మాట్లాడుతూ వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు.
