ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeఎడిటోరియల్లింగంపేట మండల బీజేపీలోకి భారీగా చేరికలు.పైడి ఎల్లారెడ్డి సమక్షంలో పలువురు బీజేపీలో చేరిక

లింగంపేట మండల బీజేపీలోకి భారీగా చేరికలు.పైడి ఎల్లారెడ్డి సమక్షంలో పలువురు బీజేపీలో చేరిక

📰 Generate e-Paper Clip

(ప్రాంతీయ వార్త ప్రతినిధి సెప్టెంబర్ 01)

లింగంపేట: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి చేపడుతున్న సేవా కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చేస్తున్న నిరంతర పోరాటాలకు ఆకర్షితులై పలువురు బీజేపీలో చేరారు.
లింగంపేట మండలానికి చెందిన వసురామ్, దినేష్, మహేష్, సర్దార్, గణేష్, నరేష్, పిర్యా తదితరులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి పైడి ఎల్లారెడ్డి బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు కోసం బీజేపీ చేస్తున్న కృషి, పార్టీ సిద్ధాంతాలు తమను ఎంతగానో ఆకర్షించాయని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం పైడి ఎల్లారెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేస్తున్న పోరాటాన్ని గుర్తించి బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో అభివృద్ధి కోసం పార్టీతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు.

బీజేపీ మరింత బలోపేతం అవుతోంది: క్రాంతికుమార్

పైడి ఎల్లారెడ్డి నాయకత్వంలో లింగంపేట మండలంలో బీజేపీ రోజురోజుకూ మరింత బలోపేతం అవుతోందని బీజేపీ లింగంపేట మండల అధ్యక్షులు క్రాంతికుమార్ అన్నారు. ప్రజల్లో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నర్సింహులు, నరేష్ భగవాన్, రమేష్, గణేష్, అనిల్, భాస్కర్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!