ప్రాంతీయ వార్త ప్రతినిధి సెప్టెంబర్ 01
గాంధారి: మండలంలోని గుజ్జుల్ తండా, లొంక తండ గ్రామపంచాయతీల పరిధిలో SIR నోటీస్ హియరింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ప్రజలు పాల్గొని, SIR నోటీసులకు సంబంధించిన అంశాలపై తమ అభిప్రాయాలు, వివరాలను అధికారులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గుజ్జుల్ తండా సర్పంచ్ ఖట్రోత్ రవీందర్, ఉప సర్పంచ్ విశ్లావత్ రమేష్, లొంక తండా సర్పంచ్ నేనావత్ సురేందర్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, రాజు, నరేష్, రవీందర్, GPO శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేశ్వరితో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
SIR ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని, తమ వివరాలను సక్రమంగా పరిశీలించుకోవాలని ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారు. నోటీసులకు సంబంధించిన ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
గుజ్జుల్ తండా, లొంక తండాలో SIR నోటీస్ హియరింగ్
RELATED ARTICLES
