ePaper
Sunday, November 15, 2026
ePaper
Homeఎడిటోరియల్భారీ వర్షాలకు విరిగిన విద్యుత్ స్తంభాలు వెంటనే స్పందించిన విద్యుత్ అధికారులు

భారీ వర్షాలకు విరిగిన విద్యుత్ స్తంభాలు వెంటనే స్పందించిన విద్యుత్ అధికారులు

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి సెప్టెంబర్ 13

గౌరారం / ఎక్కకుంట తాండ: భారీ వర్షాల కారణంగా ఎక్కకుంట తాండలో విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే AE నాగరాజు మరియు అసిస్టెంట్ లైన్‌మెన్ ప్రవీణ్ స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. విరిగిపోయిన విద్యుత్ స్తంభాల కారణంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు.
భారీ వర్షాల మధ్య కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు, విద్యుత్ సిబ్బంది త్వరితగతిన మరమ్మతు పనులు పూర్తి చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
ప్రజల సమస్యపై వెంటనే స్పందించి సేవలు అందించిన AE నాగరాజు, అసిస్టెంట్ లైన్‌మెన్ ప్రవీణ్లను ఎక్కకుంట తాండ ప్రజలు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు స్పందించిన విద్యుత్ శాఖ సిబ్బంది సేవలను స్థానిక వార్డు సభ్యుడు మేల్డే లక్ష్మణ్ ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!