భారీ వర్షాలకు విరిగిన విద్యుత్ స్తంభాలు వెంటనే స్పందించిన విద్యుత్ అధికారులు<br>

ప్రాంతీయ వార్త ప్రతినిధి సెప్టెంబర్ 13గౌరారం / ఎక్కకుంట తాండ: భారీ వర్షాల కారణంగా ఎక్కకుంట తాండలో విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే AE నాగరాజు మరియు అసిస్టెంట్ లైన్‌మెన్ ప్రవీణ్ స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. విరిగిపోయిన విద్యుత్ స్తంభాల కారణంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు.భారీ వర్షాల మధ్య కూడా...