ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeఎడిటోరియల్రామలక్ష్మణపల్లిలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

రామలక్ష్మణపల్లిలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

📰 Generate e-Paper Clip



గాంధారి, సెప్టెంబర్ 13 (ప్రాంతీయ వార్త): గాంధారి మండల ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రామలక్ష్మణపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎర్రోళ్ల సతీష్, అధికార ప్రతినిధిగా బొల్లి సుధాకర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా గాంధారి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు సంగెం రాజు మాట్లాడుతూ, మాదిగ జాతి ప్రజల మంచి చెడుల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. జాతి హక్కులు, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతూ అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ శంకర్, గాంధారి పట్టణ అధ్యక్షుడు గడ్డమిది ప్రవీణ్, మండల కార్యదర్శి పోతరాజు రాజు, నేరల్ గ్రామ అధ్యక్షుడు సంజీవ్, అధికార ప్రతినిధి సంతోష్, సర్వాపూర్ అధ్యక్షుడు పర్వయ్య, అలాగే రవీందర్, సిద్ధిరాములు, కాశీరం తదితరులు పాల్గొన్నారు.
గ్రామంలో ఎమ్మార్పీఎస్‌ను మరింత బలోపేతం చేసి, జాతి సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!