(ప్రాంతీయ వార్త ప్రతినిధి సెప్టెంబర్ 01)
గాంధారి: మండలంలోని నాగులూర్, నేరల్ గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు గాంధారి మండల అధ్యక్షులు సంఘం రాజు ఆధ్వర్యంలో ఈ కమిటీల ఏర్పాటు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం రాజు మాట్లాడుతూ.. మాదిగ జాతి హక్కులు, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాన ఎమ్మార్పీఎస్ కమిటీలను ఏర్పాటు చేసుకుని, జాతి హక్కుల కోసం నిరంతరం పోరాడాలని దిశానిర్దేశం చేశారు.
నాగులూర్ గ్రామ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా గొర్రె సాయిలు, అధికార ప్రతినిధిగా గడ్డం శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేరల్ గ్రామ అధ్యక్షుడిగా సంజు, అధికార ప్రతినిధిగా సంతోష్లను గ్రామ ప్రజల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ప్రతి గ్రామంలో ఇదే విధంగా కమిటీలను ఏర్పాటు చేసి మాదిగ జాతి హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి చిమ్మని సాయిలు, పోతరాజు రాజు, సర్వాపూర్ గ్రామ అధ్యక్షులు పర్వాయ లక్ష్మణ్, గొర్రె గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
నాగ్లూర్ నేరల్ గ్రామాల్లో నూతన ఎమ్మార్పీఎస్ కమిటీలు ఏర్పాటు
RELATED ARTICLES
