(కామారెడ్డి ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి సెప్టెంబర్ 01)
గాంధారి మండలం గుర్జల్ తండాలో బంజారా సమాజం ఆధ్వర్యంలో తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తులు ధరించి తీజ్ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తీజ్ బుట్టలను అలంకరించి, సంప్రదాయ పద్ధతుల్లో పూజలు నిర్వహించారు.
తండాలో పండుగ వాతావరణం నెలకొనగా, మహిళలు సంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేసి ఆనందాన్ని పంచుకున్నారు. బంజారా సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ఇలాంటి పండుగలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తండా పెద్దలు, మహిళలు, యువతీ యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గాంధారి మండలం గుర్జల్ తండాలో ఘనంగా బంజారాల తీజ్ పండుగ
RELATED ARTICLES
