నాగ్లూర్ నేరల్ గ్రామాల్లో నూతన ఎమ్మార్పీఎస్ కమిటీలు ఏర్పాటు

(ప్రాంతీయ వార్త ప్రతినిధి సెప్టెంబర్ 01)గాంధారి: మండలంలోని నాగులూర్, నేరల్ గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు గాంధారి మండల అధ్యక్షులు సంఘం రాజు ఆధ్వర్యంలో ఈ కమిటీల ఏర్పాటు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘం రాజు మాట్లాడుతూ.. మాదిగ జాతి హక్కులు, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాన ఎమ్మార్పీఎస్ కమిటీలను ఏర్పాటు చేసుకుని, జాతి హక్కుల కోసం నిరంతరం పోరాడాలని దిశానిర్దేశం...