ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeఎడిటోరియల్చద్మల్ తాండలో వైభవంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ భవ్య విగ్రహావిష్కరణ

చద్మల్ తాండలో వైభవంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ భవ్య విగ్రహావిష్కరణ

📰 Generate e-Paper Clip



(గాంధారి, సెప్టెంబర్ 4 ప్రాంతీయ వార్త ప్రతినిధి)

గాంధారి మండలం చద్మల్ తాండ గ్రామంలో హిందూ సామ్రాజ్య స్థాపకుడు, వీరత్వం, ధైర్యం, ధర్మ పరిరక్షణకు ప్రతీకగా నిలిచిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ భవ్య విగ్రహావిష్కరణ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ శాస్త్రవేత్త, విగ్రహదాత డా. పైడి ఎల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే నేరెళ్ల ఆంజనేయులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
శివాజీ మహారాజ్‌ చూపిన ధైర్యం, నాయకత్వం, ప్రజా సంక్షేమం, ధర్మ పరిరక్షణ వంటి విలువలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. శివాజీ మహారాజ్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో వక్తలుగా అనసూయ రెడ్డి, అంబీర్ మనోహర్ రావు పాల్గొని ప్రసంగించారు. గ్రామ ప్రజలు, శివాజీ మహారాజ్ అభిమానులు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ మహోత్సవాన్ని హిందూ రాష్ట్ర సేన, చద్మల్ తాండ మరియు గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో నిర్వహించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!