ePaper
Wednesday, July 1, 2026
ePaper
Homeఎడిటోరియల్లింగంపేట్ బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అవతరణ దినోత్సవం

లింగంపేట్ బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అవతరణ దినోత్సవం

📰 Generate e-Paper Clip



లింగంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ లింగంపేట మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని  జాతీయ జెండా ఆవిష్కరించి ఘనంగా జరుపుకోవడం జరిగింది.
తెలంగాణ ఏర్పాటుకు బిజెపి మంత్రి సుష్మా స్వరాజ్ గారి పాత్ర మొదటి అడుగుగా బిల్లును ప్రవేశపెట్టడానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ  కేంద్రంలో మరియు రాష్ట్రంలో వారి ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఉద్యమకారులతో తెలంగాణ ప్రజలతో చెలగాటమాడుతూ  పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తే  ఈ విషయాన్ని తెలంగాణ పార్లమెంట్లో ప్రశ్నించి తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన అటువంటి మొదటి మహిళా నాయకురాలు తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు
ఆనాడు తెలంగాణ ఏర్పాటుకు బిజెపి పాత్ర ప్రధానమైనదిగా పార్లమెంట్లో ఆమె బిల్లు ప్రవేశపెట్టి మాట్లాడినటువంటి అంశాల కోణంతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఉద్యమకారుల ఆగ్రహాన్ని ఎందరో తెలంగాణ రాష్ట్రం కోసం  వీరమరణం పొందిన తర్వాత రాష్ట్రాన్ని ప్రకటించింది
ఎందరో అమరవీరులు వారి ప్రాణా త్యాగం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఈనాడు మళ్లీ అదే పార్టీ అభివృద్ధికి నోచుకోకుండా చేస్తుంది.
తెలంగాణ రాష్ట్రం నుంచి కాదు భారతదేశంలో  కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు  ఈ దేశాన్ని మరియు ఈ దేశ సంపదను పరాయి దేశాల పాలు చేయడంలోనే ముందుంటుంది.
కాంగ్రెస్ పార్టీ ఈ దేశం నుంచి ఏ రోజైతే వైదొలుగుతుందో ఆరోజే తెలంగాణకు మరియు ఈ దేశానికి పట్టిన శని విరగడవుతుంది తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని దేశంలో బిజెపి చేసిన అభివృద్ధిని చూసి బిజెపి ప్రభుత్వాన్ని  తెలంగాణలో కూడా ప్రజలు కోరుకుంటున్నారని బిజెపి మండల అధ్యక్షులు బొల్లారం క్రాంతికుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ వడ్ల రామచందర్, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షులు పెద్ది సంగీత గారు, మండల ప్రధాన కార్యదర్శులు మార్గం సుభాష్, ఆకుల విష్ణువర్ధన్, బీజేవైఎం మండల అధ్యక్షుడు మార్గం రజనీకాంత్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు అంద్యాల ఉదయ్, పట్టణ అధ్యక్షులు నరేష్ భగవాన్, సీనియర్ నాయకులు మోతే మల్లయ్య, శివన్న గారి నవీన్ కుమార్, మేదరి ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యులు రాజారామ్ తల్వార్ సాయిలు, పారిపల్లి సంతోష్,బొల్లు గణేష్, హేమంత్, భాను, గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!