ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 25
లింగంపేట మండలంలోని లింగంపల్లి గ్రామములో సోమవారం గ్రామ మహిళా సంఘ భవనం నిర్మాణానికి
గ్రామ సర్పంచ్ ప్రత్యూష సాయిరాం గోకుల్ ఆధ్వర్యంలో ముగ్గు పోసి టెంకాయ కొట్టి భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్రావు సహకారంతో గ్రామ మహిళా సంఘ నూతన భవ నిర్మాణానికి 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆయనకు మహిళా సంఘాల సభ్యురాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆయన మేలును మర్చిపోలేమన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేసిందన్నారు.
మహిళల సాధరికతను సాధించడానికి కాంగ్రెస్ పార్టీ మహిళా సంఘాలకు అన్ని విధాలుగా సహకరిస్తుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు శారద, కార్యదర్శి భవాని, సిసి మన్సూర్, మహిళా సంఘాల సభ్యురాలు పాల్గొన్నారు.
మహిళా సంఘ భవన నిర్మాణానికి
భూమి పూజ..
RELATED ARTICLES
