ePaper
Wednesday, July 1, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రపంచ పర్యావరణ దినోత్సవం గాంధారి బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం గాంధారి బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం.

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 05

భారతియ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా శాఖ అడ్వర్యము లో నేడు గాంధారి మండలం లో మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు శ్రీ  నీలం చిన్న రాజులు మాట్లాడుతు గౌరవ  శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా
మన దేశంలో ప్రతి మనిషికి 100 చెట్లు అవసరం… 28 మాత్రమే ఉన్నాయి కావున

ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడం, ప్రకృతిని కాపాడే చర్యలకు ప్రోత్సాహం ఇవ్వడం ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం.
2026 సంవత్సరానికి ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను అజర్‌బైజాన్ దేశంలోని బాకు నగరంలో నిర్వహించనున్నారు. ఈ ఏడాది థీమ్ “Inspired by Nature. For Climate. For Our Future.” అంటే “ప్రకృతి స్ఫూర్తితో.. వాతావరణం కోసం.. మన భవిష్యత్తు కోసం” అనే సందేశాన్ని ప్రపంచానికి అందిస్తోంది. ఈ థీమ్ ద్వారా ప్రకృతిని కాపాడితేనే వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించగలమనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
పర్యావరణ  పరిరక్షణ వేరే ఎవరిదో  బాధ్యత అనే  భ్రమలో మనం జీవిస్తూ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం.  దాని ఫలితమే పెరిగిన ఉష్ణోగ్రతలు,  అకాల వర్షాలు, వరదలు. కలుషితమవుతున్న నేల,  నీరు, గాలి వల్ల మానవాళి మనుగడకు తీవ్ర ఆటంకాలను కలిగిస్తోంది.   ప్రపంచ  మానవాళి  మనుగడ,  శ్రేయస్సు పర్యావరణ  పరిరక్షణతో  ముడిపడి ఉంది.    ప్రపంచవ్యాప్తంగా జూన్ 5వ  తేదీన ప్రపంచ పర్యావరణ  దినోత్సవ కార్యక్రమం జరపాలని  1972లో జరిగిన  ఐక్యరాజ్యసమితి  సర్వసభ్య  సమావేశం తీర్మానించింది.  1973 జూన్ 5న  ‘భూమి ఒక్కటే’ అనే  ముఖ్య ఉద్దేశంతో  మొదటి  ప్రపంచ పర్యావరణ  దినోత్సవం ప్రారంభమైనది.  ప్రకృతి నుంచి ప్రేరణ పొందుతూ మన భవిష్యత్తు కోసం పర్యావరణ పరిరక్షణ చేపట్టాలనే  సరికొత్త ఉద్దేశంతో… 2026 జూన్ 5వ తేదీన  సభ్య దేశాలలో  విస్తృత కార్యక్రమాల ద్వారా ప్రజలలో పర్యావరణ పరిరక్షణ,  సహజ వనరుల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాల నిర్ణఎంచడం జరిగింది ఈ కార్యక్రమం లో మండలం అధ్యక్షులు మధుసూదన్  మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు మాజీ జడ్పీ చైర్మన్ పోతంగల్ కిషన్ రావు మాజీ మండలం అధ్యక్షులు సాయిబాబా  హుస్సేన్  ప్రభాకర్ రావు సత్యం  రాజు  గజానాన్  శ్రీకాంత్  పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!