ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 03
కీసర సర్కిల్ జవహర్ నగర్ జీ హెచ్ ఎంసీ(జన ప్రజావాణి)జవహర్ నగర్ బాలాజీ నగర్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఉ|| 9 గుంటల నుండి 10:30 వరకు గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని జేఏసి ఆద్వర్యంలో వందలాది మంది ప్రజలతో మానవ హారం జరిగింది.
ఈ కార్యక్రమానికి
జేఎసి కన్వీనర్ తోటపల్లి శంకర్ సిపిఐ అధ్యక్షతన జరుగగా.
జేఏసీ కో కన్వీనర్ మాజీ ఉప సర్పంచ్ రావల్ కోర్ నర్సింహాగౌడ్,సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు గడ్డం సదానందం,సిపిఐ దర్శణం యాద గిరి,సిపిఎం శివన్నారాయణ,ఐ ఎఫ్ టీయు షేక్ శావాలి,చైతన్య మహిళా సంఘం అల్లూరి సావిత్రి,ముస్లీం వెల్ఫేర్ అసోసియేషన్ కాలేషా.పౌరస్పందన వేధిక సురేష్ కుమార్,టియుసిఐవి ప్రవీణ్,ఐఎఫ్ టియు శివబాబు,ఐఎఫ్ టి యు,పివోడబ్లూ లక్ష్మి బాయి,స్వరూపక్క సావిత్రి,సునీత,జయసుధ,మంజుల తదితరులు పాల్గొని ప్రసంగించారు.
వాస్తవానికీ గబ్బిలాల పేట చుట్టు రాజీవ్ ఇందిరా నగర్,శాంతి నగర్,రాజీవ్ గాంది నగర్,జయశంకర్ నగర్,కేసిఆర్ నగర్,పాత గబ్బి లాలపేట లలో వందలాది మంది విద్యార్థులు ఉన్నారు.
కానీ అక్కడ ప్రభుత్వ పాఠశాల లేదు.కేవలం రెండు గదులతోనే నిర్వహిస్తున్నా అక్కడ ప్రజల అభిప్రాయం మేరకు జిల్లా కలెక్టర్ ఒక స్థలాన్ని ఏర్పాటు చేయగా స్థానికులు కొందరు తమ భూములని కోర్టుకు వెళ్ళి అడ్డు తగులుతుండటం మంచి పద్దతి కాదని అన్నారు.
రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా అన్నట్లు ప్రభుత్వం మీన వేశాలు లెక్కించకుండా వెంటనే ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయవచ్చు కదా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయటం లేదని విమర్శిం చారు.
వెంటనే స్థలాన్ని కేటాయించి గబ్బిలాలా పేటలోనే పాఠశాలను ఏర్పాటు చేసి తమ చిత్తశుద్దిని నిరూపించు కోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆమేరకు ప్రస్థుతానికి పై బస్తీలలో వేలాదిమందితో సంతకాలను సేకరించామని,వచ్చే వారంలో స్థానిక ప్రజా ప్రతినిదులను,జిల్లా యంత్రాంగాన్ని కలిసి వినతిపత్రం సమర్పిస్తామని,జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని,ప్రభుత్వం సకాలంలో స్పందించని యెడల సాధించు కునేంతవరకు పెద్ద యెత్తున పోరాటం చేస్తామని వెళ్ళడించారు.
రవీందర్ జర్నలిస్ట్.
జేఏసీ ఆధ్వర్యంలో విజయవంతమైన మానవహారం.
RELATED ARTICLES
