ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 03
ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆదేశాల మేరకు గాంధారి మండలంలోని చద్మాల్ తండా గ్రామంలో పీఏసీఎస్ గాంధారి ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి కొనుగోళ్లను ప్రారంభించారు.
ఇటీవల చడ్మల్ తండా గ్రామంతో పాటు పరిసర గ్రామాల రైతులు ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారిని కలిసి తమ ప్రాంతంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్వీకరించి సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి చడ్మల్ తండాలో కొనుగోలు కేంద్రం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే గారి ప్రత్యేక చొరవ, నిరంతర పర్యవేక్షణ ఫలితంగా నేడు చడ్మల్ తండా గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభమై కొనుగోళ్లు మొదలయ్యాయి. దీంతో రైతులు తమ పంటను స్థానికంగానే విక్రయించుకునే అవకాశం లభించడంతో రవాణా ఖర్చులు, సమయ నష్టం తగ్గనున్నాయి.
రైతుల సమస్యలను అర్థం చేసుకుని వెంటనే స్పందించి జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారికి చడ్మల్ తండా మరియు పరిసర గ్రామాల రైతులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే గారు ఎల్లప్పుడూ రైతులకు అండగా నిలుస్తున్నారని వారు పేర్కొన్నారు.
చద్మల్ తండాలో పీఏసీఎస్ గాంధారి ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం.
RELATED ARTICLES
