ePaper
Wednesday, July 1, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎఫ్ ఐ ఆర్ కాగానే వ్యక్తి నిందితుడు కాదు దానికి చట్టమంటూ ఉంది అదే కోర్టు.

ఎఫ్ ఐ ఆర్ కాగానే వ్యక్తి నిందితుడు కాదు దానికి చట్టమంటూ ఉంది అదే కోర్టు.

📰 Generate e-Paper Clip

మైనర్ బాలికకు సంబంధించిన ఒక సున్నితమైన కేసు ప్రస్తుతం సమాజంలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. కానీ ఈ మొత్తం వ్యవహారంలో మనం ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతున్నామేమో అనిపిస్తోంది . అది “న్యాయ ప్రక్రియ” (Due Process).

ఏదైనా కేసు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో చాలామంది తమకు తెలిసీ తెలిసిన సమాచారం, వాట్సాప్ ఫార్వర్డ్స్, స్క్రీన్‌షాట్లు, ఆధార్ కార్డులు, సర్టిఫికెట్లు, వీడియోలు, ఫోటోలు అంటూ విపరీతంగా షేర్ చేయడం మొదలుపెట్టారు. “ఇది నిజం”, “అది అబద్ధం”, “ఇవాళే తీర్పు చెప్పాలి”, “నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు?” అంటూ ఒకరిపై ఒకరు ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ అసలు ప్రశ్న ఇవన్నీ తీర్పు చెప్పేది సోషల్ మీడియానా? లేక కోర్టా? విచారణ చెయ్యాల్సింది ఎవరు?

ఇప్పుడు ఈ వ్యవహారంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ రాజారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 14 మంది యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి ఆట. మరో 27 మంది సోషల్ మీడియా క్రియేటర్లు, హ్యాండిల్స్‌పై కూడా దర్యాప్తు కొనసాగుతోందట. కారణం ఏమిటంటే మైనర్ బాలికకు సంబంధించిన వ్యక్తిగత, నిర్ధారణ కాని, అభ్యంతరకర సమాచారాన్ని విచక్షణ లేకుండా ప్రచారం చేయడం, సోషల్ మీడియా లో పంచుకోవడం.

ఇలాంటి కేసుల్లో పోలీసుల దర్యాప్తు, కోర్టు విచారణ చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే బయటకు కనిపిస్తున్న ప్రతి డాక్యుమెంట్ నిజం కావాల్సిన అవసరం లేదు. రెండు రకాల సర్టిఫికెట్లు ఉండొచ్చు. ఒక దాంట్లో తేదీ పొరపాటు ఉండొచ్చు. దానికి సవరణ కోసం అప్లికేషన్ పెట్టి ఉండొచ్చు. ఒక ఆధార్ కార్డు వైరల్ అయిందంటే అది నిజంగా ఆ బాలికదేనా? అందులో పేరు సరిగా ఉందా? ఇవన్నీ కోర్టు విచారణలోనే తేలాలి.ఒక వేళ రెండు డాక్యుమెంట్ లున్న రెండింటిలోనూ మైనర్ ఏ అనే వుంది కదా? 2008 vs 2010? డేటా లో కొంత వైరుధ్యం ఉంటే , ఇలాంటి వాటి నిర్ధారణకు పోలీసులకు ఒక ప్రక్రియ వుంటుంది. అడిషనల్ డాక్యుమెంట్ లు అడుగుతారు. ఇంకా సమస్య ఉంటే మెడికల్ టెస్ట్ లు కూడా చేస్తారు. అదొక ప్రక్రియ. ఇదంతా కోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది.

గతంలో రాష్ డ్రైవింగ్ కేసులో వేరే వయస్సు చెప్పారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కానీ అది అధికారికంగా కోర్టులో సమర్పించబడిందా? FIRలో ఏముంది? ఆ సమయంలో పోలీసులు ఏ డాక్యుమెంట్లు తీసుకున్నారు? తర్వాత సవరణలు జరిగాయా? ప్రొసీడరల్ లాప్స్ లు ఉన్నాయా? ఇవన్నీ విచారణలో భాగంగా కోర్టులోనే తేలాలి. కొన్ని సందర్భాల్లో పట్టుపడగానే చిన్నపిల్లలు భయంతో, కంగారులో తప్పుగా వివరాలు చెప్పే అవకాశం కూడా ఉంటుంది. తల్లి తండ్రులను పిలిచి మొదటి సారి అయితేఓడతి తప్పిదముగా భావించి, కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారు. చాలా రాష్ డ్రైవింగ్ కేసులు కోర్టు దాకా కూడా వెళ్లవు. అక్కడ FIR నమోదు అయ్యిందా? ఏ డాక్యుమెంట్ లు సబ్మిట్ చేశారు, విచారణ ప్రక్రియలో ఏమి జరిగిందో పోలీస్ ఫైల్ లు ఉంటాయి. పోలీస్ లు కోర్టు కు సమాధానం చెప్పుకుంటారు. కాబట్టి పాత క్లిప్పింగ్స్, స్క్రీన్‌షాట్లు తీసుకుని సోషల్ మీడియాలో మనమే తుది తీర్పులు ఇవ్వడం సరైన విధానం కాదు.

న్యాయవ్యవస్థలో ఇప్పటికే కొన్ని “precedents” ఉన్నాయి. వయస్సు నిర్ధారణ లో అనుమానం ఉన్నప్పుడు 10వ తరగతి సర్టిఫికేట్ లేదా స్కూల్ TC వంటి పత్రాలను ప్రామాణికంగా తీసుకోమని సాక్షాత్తూ సుప్రీం కోర్టు తీర్పులున్నాయి. . కాబట్టి సోషల్ మీడియాలో కనిపించిన ప్రతి పేపర్‌ను పట్టుకుని మనమే జడ్జిలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు.

ఇంకొక ప్రధాన విషయం ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన లైంగిక దాడుల కేసుల్లో సాక్ష్యాల సేకరణ చాలా కష్టం. ఈ కేసుల్లో తీర్పులు కూడా కేసు కేసు కి circumstantial evidence ను బట్టి మారుతాయి. న్యాయస్థానాల్లో ఆ సమయాల్లో న్యాయవాదుల వాదన, న్యాయమూర్తిని ఎలా కన్విన్స్ చేస్తారో ముఖ్యము. నేను ఒక ఫామ్ హౌస్ లోపలకు వెళ్ళాను అంటే నా అంతట నేను వెళ్లా అని ఏమి గ్యారంటీ కాదు. ఎన్నో వత్తిడులు, పరిస్థితులు, బ్లాక్ మెయిల్ లు, వయస్సు లోంచేసే పొరపాట్లు, లొంగిపోయి రావాల్సిన పరిస్థితులు వుంటాయి, ఇవన్నీ చూస్తారు. ఇద్దరి పాత ప్రవర్తనలు, ఆ ప్రవర్తనకు దారి తీసిన ఎన్నో విషయాలు అనలైజ్ చేస్తారు.

ఇంకొక విషయం మమ్మల్ని బెదిరించారు, నా వద్ద “₹50,000 తీసుకున్నారు” అంటూ ప్రచారం చేసిన సందర్భాల్లో కూడా, ఆ డబ్బును బాలిక తండ్రి తిరిగి వెంటనే వెన్నక్కి పంపించినట్లు సాక్ష్యాలు ఉన్నాయట. బాధిదురాలి న్యాయవాది మొత్తము ప్రతి దానికి సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు, ఒకానొక సందర్భములో జడ్జి గారే ఇక చాలు ఆపండి, నేను చాలా డాక్యుమెంట్ లు చూసా, ఇంకా చూడాలి , వెంటనే అయితే అరెస్ట్ చేయకుండా ప్రొటెక్షన్ ఇవ్వలేను అని చెప్పేసింది.

దేన్నీ అయినా నిజమో కాదో ఎవరు తేల్చాలి ? ఇరు వర్గాలు తమ తమ డాక్యుమెంట్లను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాయి. అంటే విచారణ న్యాయస్థానంలో జరగాల్సింది… యూట్యూబ్ థంబ్‌నెయిల్స్‌లో కాదు, ఫేస్‌బుక్ పోస్ట్ లలో, కామెంట్స్‌లో కాదు. రాజకీయంగా ఎదుర్కోవలసిన చోట రాజకీయంగానే ఎదుర్కోవాలి, న్యాయ ప్రక్రియలో న్యాయ ప్రక్రియ ద్వారా ఎదుర్కోవాలి. రెండింటిని కలిపితేనే సమస్య.

పోలీసులు ఇప్పటికే బాలిక వాంగ్మూలాన్ని చట్టబద్ధంగా మూడు సార్లు నమోదు చేశారు. నిందితుడు చాలా రోజుల తర్వాత లొంగిపోయాడు. కోర్టు రిమాండ్ విధించింది. వచ్చే వారంలో మళ్లీ వాదోపవాదాలు జరుగుతాయి. ఎవరి వాదన వారు వినిపిస్తారు. సాక్ష్యాలు పరిశీలిస్తారు. వాదనలు, కౌంటర్ వాదనలు జరుగుతాయి. ఇదంతా ఒక ప్రక్రియ. అదే న్యాయ ప్రక్రియ.

మనకు నచ్చిన వ్యక్తి అయితే ఒకలా, నచ్చని వ్యక్తి అయితే మరోలా స్పందించడం కాదు న్యాయం. కోర్టు నిర్ణయించే వరకు ఓపికగా ఉండడం, నిర్ధారణ కాని సమాచారాన్ని షేర్ చేయకుండా ఉండడం, ముఖ్యంగా మైనర్‌ల గౌరవం , గోప్యతను కాపాడడం, ఇవే బాధ్యతగల సమాజ లక్షణాలు. చట్టం చెప్పింది కూడా అదే.

సోషల్ మీడియా శక్తివంతమైన వేదిక. కానీ అదే వేదిక ను సరిగా వినియోగించుకోకపోతే కొన్ని జీవితాలను నాశనం చేయగలదు కూడా. అందుకే చట్టం ఉంది. కోర్టులు ఉన్నాయి. విచారణ వ్యవస్థ ఉంది.

కాబట్టి తీర్పు సోషల్ మీడియా లో ఇవ్వకూడదు. తీర్పు కోర్టు ఇవ్వాలి.

 

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!