ఎఫ్ ఐ ఆర్ కాగానే వ్యక్తి నిందితుడు కాదు దానికి చట్టమంటూ ఉంది అదే కోర్టు.

మైనర్ బాలికకు సంబంధించిన ఒక సున్నితమైన కేసు ప్రస్తుతం సమాజంలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. కానీ ఈ మొత్తం వ్యవహారంలో మనం ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతున్నామేమో అనిపిస్తోంది . అది “న్యాయ ప్రక్రియ” (Due Process). ఏదైనా కేసు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో చాలామంది తమకు తెలిసీ తెలిసిన సమాచారం, వాట్సాప్ ఫార్వర్డ్స్, స్క్రీన్‌షాట్లు, ఆధార్ కార్డులు, సర్టిఫికెట్లు, వీడియోలు, ఫోటోలు అంటూ విపరీతంగా షేర్ చేయడం మొదలుపెట్టారు. “ఇది నిజం”, “అది అబద్ధం”,...