ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 30.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాలను పురస్కరించుకుని అమ్మకు అక్షరమాల ఉల్లాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి 11వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీ శివరాములు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల అక్షరాస్యతతోనే కుటుంబ, సమాజం మరియు దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రతి మహిళ చదువు పట్ల ఆసక్తి కనబరిచి అక్షరాస్యతను పెంపొందించుకోవాలని సూచించారు.
మహిళలు విద్యావంతులైతే కుటుంబ ఆర్థిక పరిస్థితులతో పాటు పిల్లల భవిష్యత్తు కూడా మెరుగుపడుతుందని తెలిపారు. ప్రభుత్వం మహిళల సాధికారత కోసం చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ప్రతి మహిళ స్వయం సమృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు అక్షరాస్యత ప్రాముఖ్యత, విద్య వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, మెప్మా ఆర్పీలు, స్థానిక మహిళలు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
అమ్మకు అక్షరమాల–ఉల్లాస్ కార్యక్రమంలో మహిళా అక్షరాస్యతపై అవగాహన
RELATED ARTICLES
