అమ్మకు అక్షరమాల–ఉల్లాస్ కార్యక్రమంలో మహిళా అక్షరాస్యతపై అవగాహన
ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 30.కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాలను పురస్కరించుకుని అమ్మకు అక్షరమాల ఉల్లాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి 11వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీ శివరాములు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల అక్షరాస్యతతోనే కుటుంబ, సమాజం మరియు దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రతి మహిళ చదువు పట్ల ఆసక్తి కనబరిచి అక్షరాస్యతను పెంపొందించుకోవాలని సూచించారు.మహిళలు విద్యావంతులైతే కుటుంబ ఆర్థిక పరిస్థితులతో పాటు పిల్లల భవిష్యత్తు కూడా మెరుగుపడుతుందని తెలిపారు. ప్రభుత్వం...