ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 29
అపర భగీరథుడు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారి కృషికి జలాల్‌పూర్ గ్రామ ప్రజల ఘన సన్మానం*
ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట్ మండలం జలాల్‌పూర్ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడింది. *అపర భగీరథుడు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారి ప్రత్యేక చొరవతో నూతన బోరు మరియు త్రాగునీటి పైప్‌లైన్ ఏర్పాటుకు రూ.7.50 లక్షల నిధులు మంజూరయ్యాయి.*
ఈ శుభవార్తతో ఆనందోత్సాహాలకు లోనైన గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తమ కృతజ్ఞతాభావాన్ని చాటుకున్నారు.
గ్రామ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారి అవిశ్రాంత సేవలు అభినందనీయమని గ్రామస్తులు కొనియాడారు. ఈ నిధులతో గ్రామ ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి వచ్చి, నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
*ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే స్పందించే ప్రజానాయకుడు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారికి జలాల్‌పూర్ గ్రామ ప్రజల హృదయపూర్వక ధన్యవాదాలు.
