ePaper
Saturday, July 18, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన భూంపల్లి గ్రామ సర్పంచ్, గైని శ్రీనివాస్...

ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన భూంపల్లి గ్రామ సర్పంచ్, గైని శ్రీనివాస్ వార్డు సభ్యుడు. బండ శీను

📰 Generate e-Paper Clip

(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 17)

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం: భూంపల్లి గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్ మరియు వార్డు సభ్యుడు బండ శ్రీను ఎమ్మెల్యే మదన్ మోహన్* ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన భూంపల్లి గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆయన వెల్లడించాడు, గత 20 సంవత్సరాలుగా ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని, కానీ ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంలో ఇప్పుడు అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాపాలన, అభివృద్ధి కార్యక్రమాలు తమను కాంగ్రెస్ పార్టీలో చేరేలా చేశాయని పేర్కొన్నారు.భూంపల్లి గ్రామానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ చొరవతో *సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి నిధులు, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, మహిళా సంఘ భవనం* వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అందాయని తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్  నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!