(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 17 )
కామారెడ్డి పట్టణ కేంద్రంలోని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో మాచారెడ్డి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి* మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాచారెడ్డి x road (Gnt) సర్పంచ్ రావుల వినోదా- ప్రభాకర్, ఉప సర్పంచ్, భిక్షపతి, వార్డు సభ్యులు రామ, భిక్షపతి, లకావత్ రమేష్, స్వామి పాల్గొన్నారు.
అలాగే కాకులగుట్ట సర్పంచ్ భూక్యా రాజు, ఉప సర్పంచ్ నరేష్, సంజీవ్, మహేష్ గౌడ్, శంకర్, సంతోష్ నాయక్, కళ్యాణ్, గణేష్, సురేష్, రాజు, బాలా గౌడ్, ప్రకాష్, రవీందర్ గౌడ్, శివాచరణ్, సాయి నిఖిల్, విజయ్, సురేష్, అనిల్, నందు, సంతోష్, గంగుల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
