టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాచారెడ్డి సర్పంచ్
(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 17 ) కామారెడ్డి పట్టణ కేంద్రంలోని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో మాచారెడ్డి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి* మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. గ్రామ స్థాయిలో పార్టీని...