(రాజంపేట జూలై 5 ప్రాంతీయ వార్త)
రాజంపేట గ్రామ సర్పంచ్ దుబ్బని శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిన్ననాటి మిత్రులు, గ్రామ ఉప సర్పంచ్ మర్ ఇమ్రాన్ అలీ ఆధ్వర్యంలో యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గంప శ్రావణ్, బంధం సురేష్, జంగం భాను, విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయుడు షేక్ రహమత్‌తో పాటు పలువురు యువకులు రక్తదానం చేశారు. రక్తదానం చేయడం ద్వారా అవసరమైన వారికి ప్రాణదానం చేసినట్లేనని వారు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ దుబ్బని శ్రీకాంత్ మాట్లాడుతూ తన పుట్టినరోజును పురస్కరించుకొని రక్తదానం చేసిన యువకులను ప్రత్యేకంగా అభినందించి వారికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే తన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యక్షంగా, ఫోన్ ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
సర్పంచ్ పుట్టినరోజున రక్తదానం
RELATED ARTICLES
