ePaper
Friday, July 17, 2026
ePaper
Homeఎడిటోరియల్కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు పటేల్ సాయిబాబాకు ఘన సన్మానం

కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు పటేల్ సాయిబాబాకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip



(రాజంపేట జిల్లా 05 ప్రాంతీయ వార్త)

రాజంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన పటేల్ సాయిబాబాను రాజంపేట గ్రామ మున్నూరు కాపు, మ్యాకల వారి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు పటేల్ సాయిబాబాకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పటేల్ సాయిబాబా మాట్లాడుతూ తనపై పార్టీ నాయకత్వం, గ్రామ ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. పార్టీ బలోపేతంతో పాటు గ్రామ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు, మ్యాకల వారి సంఘం సభ్యుడు మ్యాకల లింబాద్రి, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంఘం సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!