కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు పటేల్ సాయిబాబాకు ఘన సన్మానం
(రాజంపేట జిల్లా 05 ప్రాంతీయ వార్త)రాజంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన పటేల్ సాయిబాబాను రాజంపేట గ్రామ మున్నూరు కాపు, మ్యాకల వారి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు పటేల్ సాయిబాబాకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పటేల్ సాయిబాబా మాట్లాడుతూ తనపై పార్టీ నాయకత్వం, గ్రామ ప్రజలు ఉంచిన...