సర్పంచ్ పుట్టినరోజున రక్తదానం

(రాజంపేట జూలై 5 ప్రాంతీయ వార్త) రాజంపేట గ్రామ సర్పంచ్ దుబ్బని శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిన్ననాటి మిత్రులు, గ్రామ ఉప సర్పంచ్ మర్ ఇమ్రాన్ అలీ ఆధ్వర్యంలో యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గంప శ్రావణ్, బంధం సురేష్, జంగం భాను, విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయుడు షేక్ రహమత్‌తో పాటు పలువురు యువకులు రక్తదానం చేశారు. రక్తదానం చేయడం ద్వారా అవసరమైన వారికి ప్రాణదానం చేసినట్లేనని వారు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ దుబ్బని...