ప్రాంతీయ వార్త ప్రతినిధి జులై 01
ఎల్లారెడ్డి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం విజయవంతం కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన కు లోనైనారని ఎల్లారెడ్డి పట్టణ ప బి ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఆదిమూలం సతీష్ కుమార్ ఆరోపించారు
సోమవారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని స్థానిక మాజీ ఎమ్మెల్యే సురేందర్ అన్న గారి ఫామ్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 30న ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయి బారాస పార్టీ సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే ఈ సమావేశం విజయవంతం కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీలో గుబులు ప్రారంభమైందని ఆయన అన్నారు ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడిన విషయానికి ఆయన తీవ్రంగా ఖండించారు
బారాస సమావేశంలో నూరు 150 మంది కంటే ఎక్కువ కార్యకర్తలు పాల్గొనలేదని విలేకరుల సాక్షిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పడంతో కచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీకి భయం మొదలైందని ఆయన అన్నారు ఎందుకంటే బారాస సమావేశంలో ఎంతమంది పాల్గొన్నారని విషయం ఫోటోలు చూస్తే అర్థమవుతుంది వీడియోలు చూస్తే స్పష్టంగా కనబడుతుంది కానీ అధికార కాంగ్రెస్ పార్టీ వారికి అవి కనిపిస్తలేవా అని ఆయన మండిపడ్డారు కళ్ళు సరిగా కనబడకపోతే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అటువంటి కంటి వెలుగు పథకంలో చికిత్స చేయించుకుంటే బాగుండేదేమోనని ఆయన ఎద్దేవా చేశారు ఇక రైతులు పండించిన వారి ధాన్యాన్ని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కాంటాలు చేసి రైస్ మిల్లకు తరలిస్తున్నామని చెప్తున్నారు కదా మరి మేము మాలు తుమ్మెద నుండి మొదలుకుంటే నియోజకవర్గంలో ప్రతి మండలాల్లోని గ్రామాలకు మేము గులాబీ కండువా వేసుకొని వస్తాము మీరు కాంగ్రెస్ కండువాలు వేసుకొని రావాలని ఆయన సవాల్ విసిరారు అప్పుడు రైతులకు ఏ ప్రభుత్వం మేలు చేసిందో వారే చెప్తారని అన్నారు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మీ పార్టీ కండువాలతో మేము మా పార్టీ కండువాళ్ళతో రైతుల వద్దకు వెళ్దామని ఆయన అన్నారు అక్కడే రైతులు స్పష్టమైన బాధలను వారు అనుభవిస్తున్నటువంటి తీరును తెలియజేస్తాడు అప్పుడు ఏ ప్రభుత్వంలో రైతులను ఆదుకున్నారనేది అర్థమవుతుందని ఆయన ధ్వజమెత్తారు ఇక ముఖ్య విషయం గత ప్రభుత్వంలో వేముల ప్రశాంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారని అంటున్నారు కానీ మీకు కనీస రాజకీయ అవగాహన ఉందో లేదో మాకు తెలియదు గానీ మీ అధికార పార్టీ సీనియర్ నాయకులను ఎమ్మెల్యేలను తెలుసుకోండి ప్రశాంత్ రెడ్డి గారు ఏ శాఖలో బాధ్యతలు నిర్వహించారు తెలుస్తుంది ఇకపోతే మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు మతిభ్రమించి అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్తున్నారు కదా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష మీరు ఒకసారి వినాలి అప్పుడు మీకు అర్థమవుతుంది అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేస్తున్నారని ముందు మీ ముఖ్యమంత్రి గారి నోరును అదుపులో పెట్టుకోమని చెప్పండి ఎందుకంటే రాష్ట్రానికి మార్గదర్శకునిగా ఉన్నటువంటి వ్యక్తులే అలాంటి భాషలు మాట్లాడుతున్నప్పుడు ఇతరులు కూడా మితిమీరి మాట్లాడే పరిస్థితి వస్తుందని గమనించాలి ఇక నియోజకవర్గంలో ప్రజలు రైతులు వ్యాపారస్తులు తదితర రంగాల వారు ఈ ప్రభుత్వంలో ఎంత అరిగోస పడుతున్నా విషయంతెలియాలంటే ముందు అధికార పార్టీ వారు ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలను తెలుసుకోవాలి అది రాజకీయం అంటారు
ఇంకో ముఖ్య విషయం ఏంటంటే గత 2018లో కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకున్న సురేందర్ గారిని గెలిపించుకోవడంలో ఇప్పటి ఎమ్మెల్యే పాత్ర ఎంత ఉందని ప్రశ్నించారు టికెట్ రాని మరుక్షణమే ఆయన నియోజకవర్గంలో కనుమరుగైన విషయం గుర్తు చేశారు అంతేకాదు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని ఓడించారు అని చెప్తున్నారు కదా అదే 2019లో ఇప్పటి ఎమ్మెల్యే గారు అప్పటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు గెలుపు ఓటములు సహజమనే విషయం కూడా తెలియని నాయకులు అధికార పార్టీలో ఉండడం సిగ్గుచేటని వారు ఆరోపించారు ఈ కార్యక్రమంలో బారాస నాయకులు గంగారెడ్డి ఎరుకల సాయిలు ఇమ్రాన్ దయాకర్ దేవదాస్ బర్కత్ అరవింద్ గౌడ్ బబ్లు నాగం రాజయ్య సాయిలు తో పాటు పలువు పాల్గొన్నారు
బారాస పార్టీ సమావేశం విజయవంతం కావడంతో ఆందోళనకు గురైన కాంగ్రెస్ నాయకులు
RELATED ARTICLES
