ePaper
Tuesday, July 14, 2026
ePaper
Homeఎడిటోరియల్మైనారిటీ సంక్షేమంపై రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,...

మైనారిటీ సంక్షేమంపై రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,

📰 Generate e-Paper Clip

(ప్రాంతీయ వాత ప్రతినిధి రవి 13)

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమం మరియు ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి *శ్రీ మహమ్మద్ అజారుద్దీన్ గారి కార్యాలయంలో ఈరోజు జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే  తోట లక్ష్మీకాంతరావు గారు,* కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు *శ్రీ ఏలే మల్లికార్జున్ గారు* మర్యాదపూర్వకంగా కలిసి మైనారిటీ సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా మరియు జుక్కల్ నియోజకవర్గంలోని మైనారిటీ ప్రజల సంక్షేమం, విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలు వంటి అంశాలపై మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మైనారిటీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ గారు నాయకులు ప్రస్తావించిన అంశాలను సానుకూలంగా స్వీకరించి, ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ మర్యాదపూర్వక సమావేశంలో *ఎన్‌ఆర్‌ఐ భుజంగారి భాస్కర్ రెడ్డి గారు* కూడా పాల్గొన్నారు.
ఈ సమావేశం సానుకూల వాతావరణంలో సాగి, కామారెడ్డి జిల్లా మరియు జుక్కల్ నియోజకవర్గ మైనారిటీ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలనే ఆకాంక్షను నాయకులు వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!