(ప్రాంతీయ వార్త రవి ఆగస్టు 27)
కామారెడ్డి, ఆగస్టు 27: విశ్వహిందూ పరిషత్ దుర్గా వాహిని ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా వాహిని జిల్లా సహ సంయోజిక హరిని, నగర సంయోజిక సంజన పోలీసు అధికారులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
సమాజ రక్షణ కోసం నిరంతరం విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి రక్షాబంధన్ సందర్భంగా రాఖీలు కట్టి, వారి రక్షణ కర్తవ్యాల్లో ఎల్లప్పుడూ మంచి జరగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులు చేస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సంఘటన మంత్రి వినోద్, బజరంగ్‌దళ్ గోరక్ష ప్రముఖ్ ఏకేష్, సేవా ప్రముఖ్ అజయ్, అనిల్, రాము, మంచాల రాజు తదితరులు పాల్గొన్నారు.
పోలీసులకు రాఖీ కట్టిన దుర్గా వాహిని కార్యకర్తలు
RELATED ARTICLES
