(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి ఆగస్టు 26)
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, సామాజిక అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్ల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా మంత్రి అడ్లూర్ లక్ష్మణ్ గారి అపాయింట్‌మెంట్ తీసుకుని, ఆయనను కలిసి సమస్యను వివరించారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 8 మండలాల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు గ్రామస్థాయిలో కమ్యూనిటీ హాళ్లు అవసరమని ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు, వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు ఈ కమ్యూనిటీ హాళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు.
ప్రతి మండలంలోని అవసరమైన గ్రామాలను గుర్తించి కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మంత్రిని కోరారు. నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉపయోగపడే ఈ మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకంగా మంత్రి స్థాయిలో చర్యలు తీసుకునేలా ఎమ్మెల్యే చొరవ చూపారు.
ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి వినతిపై మంత్రి అడ్లూర్ లక్ష్మణ్ గారు సానుకూలంగా స్పందించి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అవసరాలను పరిశీలించి
