(ప్రాంతీయ వార్త రవి ఆగస్టు 27)
గాంధారి మండలం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామంలో ఓటరు జాబితాను తనిఖీ చేశారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓ) ఆధ్వర్యంలో ఓటరు జాబితాలోని వివరాలను పరిశీలించారు.
ఓటరు జాబితాలో ఉన్న తప్పులు, పొరపాట్లను గుర్తించడంతో పాటు ఇతర గ్రామపంచాయతీలకు బదిలీ అయిన ఓటర్ల వివరాలను కూడా పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా, వివరాల్లో ఎలాంటి తప్పులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బంగారు శంకర్, ఉపసర్పంచ్ సౌందర్య, వార్డు సభ్యులు, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ఓటరు జాబితా తనిఖీ
RELATED ARTICLES
