(ప్రాంతీయ వార్త రవి ఆగస్టు 27)
నాగిరెడ్డిపేట: పోచారం డ్యామ్‌ను పూర్తిస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం డ్యామ్‌ను ఆయన సందర్శించి, అక్కడి పర్యాటక అభివృద్ధి అవకాశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ పోచారం డ్యామ్ ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకర్షించే సామర్థ్యం కలిగి ఉందన్నారు. డ్యామ్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు బోటింగ్ సౌకర్యం, హరిత ప్రాంతాలు, పిల్లల ఆట స్థలాలు, వీక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
పర్యాటకులకు అవసరమైన మౌలిక వసతులు, పార్కింగ్, సౌకర్యాలు కల్పించి పోచారం డ్యామ్‌ను ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడితే స్థానికంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
పోచారం డ్యామ్‌ను పూర్తిస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి
RELATED ARTICLES
