ePaper
Saturday, July 18, 2026
ePaper
Homeఎడిటోరియల్గాలిపూర్, అచ్చంపేట్ గ్రామాల్లో గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్.

గాలిపూర్, అచ్చంపేట్ గ్రామాల్లో గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్.

📰 Generate e-Paper Clip

(ప్రాంతీయ వార్త ప్రతినిధి జులై 03)

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు *శ్రీ ఏలే మల్లికార్జున్ గారు* ఈరోజు నిజాంసాగర్ ఉమ్మడి మండలంలోని గాలిపూర్ గ్రామంలో నూతన ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన ఇందిరమ్మ గృహానికి రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశాన్ని ప్రారంభించారు. అనంతరం గృహ యజమానులను శాలువాతో ఘనంగా సత్కరించి, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన గృహంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
అనంతరం అచ్చంపేట్ గ్రామంలో *సాయిబాబా గారి* నూతన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని, కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ నూతన గృహం శాంతి, సిరిసంపదలు, ఆనందాలకు నిలయంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!